అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Police Transfers | హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ నగర కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన మార్పులలో భాగంగా 16 మంది ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారు. నగరం అంతటా పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, శాంతిభద్రతల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా బదిలీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Hyderabad Police Transfers | బాలాపూర్ ఎస్‌హెచ్‌వోగా నాగరాజు..
ఐఎస్ సదన్ ఎస్‌హెచ్‌వో నాగరాజు బాలాపూర్ ఠాణా ఎస్‌హెచ్‌వోగా బదిలీ అయ్యారు. ఐఎస్ సదన్ డీఐ సాయి ప్రకాశ్ గౌడ్ అదే ఠాణా ఎస్‌హెచ్‌వోగా నియమితులయ్యారు. విజయ్ మోహన్ రాజేంద్ర నగర్ డీఐగా, ఆదిబట్ల డీఐగా కేసరి ప్రసాద్, హెచ్ న్యూ విభాగంలో పని చేస్తున్న బాలస్వామి నాంపల్లి డీఐగా ట్రాన్స్ఫర్ అయ్యారు.
Hyderabad Police Transfers | వీఆర్ నుంచి సీసీఎస్‌కు..
సైబర్ క్రైమ్స్లోని జయశంకర్‌ను జూబ్లీహిల్స్ డీఐగా, ఎం సుధాకర్‌ను స్పెషల్ బ్రాంచ్‌కు, రాఘవేందర్‌ను హెచ్–న్యూ విభాగానికి బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న కమల్‌కుమార్, రవికుమార్, నర్సింహలను సీసీఎస్‌కు పంపించారు. వీఆర్‌లోని ముత్తు యాదవ్‌ను సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు, యదేందర్ను చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు, రాజశేఖర్‌ను జూబ్లీహిల్స్ జోన్‌కు, సైదాబాబును చిలకలగూడ ఠాణా డీఐగా బదిలీ చేశారు. జూబ్లీహిల్స్ ఠాణా డీఐ సత్యనారాయణను వీఆర్‌కు అటాచ్ చేశారు.
ఇది కూడా చదవండి..: ATM Robbery | గ్యాస్‌కట్టర్‌తో కట్ చేసి.. ఏటీఎంలో చోరీ