Wife Shot Dead | భార్యను గన్​తో కాల్చి చంపిన భర్త

మల్కాజ్‌గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపాడో వ్యక్తి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Wife Shot Dead | మల్కాజ్‌గిరిలో కాల్పుల కలకలం రేపాయి. భార్యను తుపాకీతో కాల్చి చంపాడో వ్యక్తి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

మల్కాజ్​గిరి (Malkajgiri) పరిధిలోని మారుతినగర్​కు చెందిన అరుణ్​కుమార్​ రియల్​ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అతడికి గతంలో మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం బాగాలేకపోవడంతో మొదటి భార్య సోదరి నిషారాణిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు ఇతర వ్యక్తులతో సంబంధం ఉందని అరుణ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

Wife Shot Dead | మాట్లాడుకుందామని చెప్పి..

ఈ క్రమంలో బుధవారం కూర్చొని మాట్లాడుకుందామని నిషారాణికి అరుణ్ చెప్పాడు. మరో వ్యక్తితో కలిసి వచ్చాడు. అనంతరం ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో నిషారాణి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Wife Shot Dead | మూడు నెలల క్రితం హత్యాయత్నం

అరుణ్​కుమార్​ తన రెండో భార్య నిషారాణిని చంపాలని మూడు నెలల క్రితమే పథకం రచించాడు. ఈ మేరకు బీహార్​ (Bihar) నుంచి తుపాకీ కొనుగోలు చేశాడు. దానిని ఎలా పేల్చాలో ప్రాక్టీస్​ కూడా చేశాడు. అయితే ఆయన వద్ద తుపాకీ ఉందనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. తుపాకీ, ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు. బయటకు వచ్చిన అనంతరం అరుణ్​ తన భార్యను హత్య చేశాడు.

ఇది కూడా చదవండి..: Minors Theft | జల్సాల కోసం అడ్డదారి తొక్కిన మైనర్లు.. ఆన్​లైన్​ షాపింగ్​ మోజులో చోరీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *