అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Airport Bus Ticket Prices | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విమానాశ్రయ బస్సు ఛార్జీలను 150 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ (Hyderabad)లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి నడిచే ‘పుష్పక్’ (Pushpak) ఏసీ బస్సుల ఛార్జీలను 40 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. సవరించిన ఛార్జీలు అక్టోబర్ 7 (నేటి) నుంచి అమలులోకి వస్తాయి.
Airport Bus Ticket Prices | తగ్గించిన రేట్లు..
జేబీఎస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు గతంలో రూ.350 టికెట్ ఉండగా.. తాజాగా దానిని రూ.200కు తగ్గించారు. మియాపూర్ నుంచి విమానశ్రయం వరకు రూ.350 టికెట్ ఉండగా రూ.200కు తగ్గించారు. గచ్చిబౌలి నుంచి టికెట్ ధర రూ.300 నుంచి రూ.150కి, లింగంపల్లి–ఎయిర్‌పోర్టు టికెట్ రూ.300 నుంచి రూ.200కు తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. కొండాపూర్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రూ.300 నుంచి రూ.200కు తగ్గించారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Police Transfers | పలువురు ఇన్స్పెక్టర్ల బదిలీ