అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahanadi Coalfields IPO | లిస్టింగ్ గెయిన్స్ కోసం ప్రైమరీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికోసం మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. దిగ్గజ ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ, ప్రపంచంలోనే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కోల్ ఇండియా తన సబ్సిడరీ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ను పబ్లిక్ ఇష్యూకు తీసుకువస్తోంది. ఈ కంపెనీలో సుమారు 10 శాతం వాటాను కోల్ ఇండియా విక్రయించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.
Mahanadi Coalfields IPO | వచ్చేనెలలో..
ఒడిశా పరిధిలో పనిచేసే మహానది కోల్‌ఫీల్డ్స్ విలువ రూ. లక్ష కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో కోల్ ఇండియాకు వందశాతం వాటాలున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా పది శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 10 వేల కోట్ల వరకు నిధులు సమీకరించాలన్న యోచనతో కోల్ ఇండియా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ ఇప్పటికే పెట్టుబడిదారుల సమావేశాలను ప్రారంభించిందని తెలుస్తోంది. కాగా కంపెనీ ఐపీవో (IPO) వచ్చేనెలలో ప్రారంభమయ్యే అవకకాశాలున్నాయని భావిస్తున్నారు. ఐపీవో సైజ్, ప్రైస్ బ్యాండ్ తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Mahanadi Coalfields IPO | కోల్ ఇండియానుంచి మరో ఐపీవో కూడా..
కోల్ ఇండియా కంపెనీ తన సబ్సిడరీలను వరుసగా పబ్లిక్ ఇష్యూకు తీసుకు రావాలని యోచిస్తోంది. 2030 నాటికి కోల్ ఇండియా తన మొత్తం అనుబంధ సంస్థలలను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్‌ను లిస్ట్ చేసిన కంపెనీ.. వచ్చేనెలలో మహానది కోల్‌ఫీల్డ్స్ ను పబ్లిక్ ఇష్యూకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ‘సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ’ కూడా ఐపీవో కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ ఇష్యూ ద్వారా 800 మిలియన్ డాలర్లు సమీకరించాలని యోచిస్తోంది. త్వరలో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, వెస్టర్న్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీవోలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి..: Mukesh Ambani Wealth | ఒక్కరోజే రూ.50,000 కోట్లు జంప్.. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్‌గా ముఖేష్ అంబానీ గ్రాండ్ రికార్డ్