అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలొస్తున్నాయి. రూపాయి విలువలో బలహీనత కొనసాగుతోంది. కోవిడ్ నాటి పరిస్థితులు తిరిగి తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనతో దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండడంతో సూచీలు భారీగా పతనమవుతున్నాయి.
Stock Market Crash | అమ్మకాల ఒత్తిడి..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 690 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 40 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో మరో 513 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 206 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 141 పాయింట్లు పతనమైంది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 901 పాయింట్ల నష్టంతో 76,426 వద్ద, నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 23,922 వద్ద ఉన్నాయి.
Stock Market Crash | ఫార్మా, ఐటీ మినహా..
ఫార్మా, ఐటీ రంగాల ఇండెక్స్‌లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. నిఫ్టీ (Nifty) ఫార్మా ఇండెక్స్ 0.67 శాతం, ఐటీ ఇండెక్స్ 0.28 శాతం లాభంతో ఉండగా.. నిఫ్టీలో కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 3.27 శాతం, రియాలిటీ 2.22 శాతం, పవర్ 1.73 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.61 శాతం, ఆటో 1.60 శాతం, మీడియా 1.45 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.22 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.22 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.17 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.
Stock Market Crash | మార్కెట్ పతనానికి కారణాలు..
పశ్చిమాసియాలో శాంతి చర్చల విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇరాన్ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఆ దేశ శాంతి ప్రతిపాదనలను అమెరికా తోసిపుచ్చింది. అమెరికా అసాధ్యమైన డిమాండ్లతో వస్తోందంటూ ఇరాన్ వాటిని తిరస్కరించింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి.దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. దీంతో రూపాయిపై ప్రభావం పడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరోసారి 95 కు పడిపోయింది.జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన హెచ్చరికలు సైతం మార్కెట్ పతకానికి కారణమయ్యాయి.
యుద్ధాల వల్ల అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లను నిలిపివేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ప్రభావాన్ని నివారించేందుకు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజారవాణా సౌకర్యాలను వాడుకోవాలని సూచించారు. దీంతోపాటు Work from home గురించి కూడా ఆయన ప్రస్తావించడంతో కోవిడ్ నాటి పరిస్థితులు తిరిగి ఏర్పడతాయేమోనన్న భయాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. దీంతో మార్కెట్ షేక్ అవుతోంది.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్స్ లాభాలతో, 23 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సన్‌ఫార్మా 1.89 శాతం, టీసీఎస్ 0.57 శాతం, ఇన్ఫోసిస్ 0.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.28 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.27 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టైటాన్ 6.34 శాతం, ఇండిగో 4.67 శాతం, ఎస్‌బీఐ 4.22 శాతం, ఎయిర్‌టెల్ 3.81 శాతం, ఎటర్నల్ 3.32 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: May 11 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ క్యూస్.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

