May 25 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 25 Market Analysis | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణ, హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్, అమెరికాలు ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయన్న ట్రంప్ ప్రకటనతో ఇన్వెస్టర్లలో ఆశలు చిగురించాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు వంద డాలర్ల దిగువకు దిగివచ్చింది.

దీంతో గ్లోబల్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్, యూరోప్ Europe మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

akshara today 1 5.jpgmarket 5
May 19 Market Analysis

May 25 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.19 శాతం, ఎస్ అండ్ పీ 0.37 శాతం పెరిగాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.66 శాతం లాభంతో ఉంది.

May 25 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.13 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.37 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.22 శాతం పెరిగాయి.

May 25 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.76 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.11 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.63 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.61 శాతం లాభాలతో కదలాడుతున్నాయి. హాంగ్‌కాంగ్ , సౌత్ కొరియా మార్కెట్లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 1.13 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 4వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,440 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 5వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 6,003 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1 నుంచి 1.08 కు పెరిగింది.
  • విక్స్ 17.82 వద్ద స్థిరంగా ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 98.94 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 52 పైసలు బలపడి 95.69 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.56 వద్ద ఉన్నాయి.

11,000-Carat Rare Ruby Discovered in Mogok | “రక్తపు వెలుగులీనిన వెదజల్లిన రత్నాల గడ్డ” – మోగక్‌లో 11,000 క్యారెట్ల అరుదైన మహా కెంపు వెలుగు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *