అక్షరటుడే, వెబ్డెస్క్: LCC Projects IPO | ఎల్ సీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీని 2017లో స్థాపించారు. ఇది ప్రధానంగా నీటిపారుదల, నీటి సరఫరా ప్రాజెక్టులపై పనిచేసే ఒక ఇంజినీరింగ్, సేకరణ మరియు నిర్మాణ (ఈపీసీ) సంస్థ.
దీని ప్రాజెక్టులలో ఆనకట్టలు, బ్యారేజీలు, వీర్లు, హైడ్రాలిక్ నిర్మాణాలు, కాలువలు, పైపు పంపిణీ నెట్‌వర్క్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, నీటి సరఫరా పథకాలు తదితర ఈపీసీ ప్రాజెక్టుల నిర్మాణాలున్నాయి. ఈ సంస్థ 11 రాష్ట్రాలలో సేవలందిస్తోంది.
LCC Projects IPO | రూ. 427.14 కోట్ల ఐపీవో..
మార్కెట్ నుంచి రూ. 427.14 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఎల్ సీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో (IPO)కు వచ్చింది. ఇందులో రూ. 158 కోట్లు ఫ్రెష్ ఇష్యూ. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించి సమీకరించనున్నారు. ఐపీవో ద్వారా సమకూరిన నిధులను పరికరాల కొనుగోలు, రుణాలలో మొత్తం లేదా కొంత భాగాన్ని ముందస్తుగా చెల్లించడం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం వినియోగించనుంది.
LCC Projects IPO | ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 139 నుంచి రూ. 146 మధ్యలో నిర్ణయించింది. ఒక లాట్‌లో 102 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం రూ. 14,892 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్లు దాఖలు చేయవచ్చు.
కోటా : మొత్తం ఇష్యూలో 50 శాతం క్యూఐబీలు, యాంకర్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ)కు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు.
జీఎంపీ : గ్రే మార్కెట్‌లో ఎల్ సీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈనెల 4వ తేదీన ఒక్కో షేరుపై రూ. 17 జీఎంపీ ఉండగా.. 10వ తేదీనాటికి ఇది రూ. 50కి చేరింది. అంటే ఒకవేళ ఐపీవో అలాట్ అయితే మీకు లిస్టింగ్ సమయంలో 34 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఐపీవో తేదీలు : ఐపీవో సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 9న ప్రారంభమైంది. 11 వరకు అందుబాటులో ఉంటుంది. 15న రాత్రి షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Vivo T5 5G | అధునాతన ఫీచర్లతో వీవోనుంచి మరో ఫోన్.. ఆ కార్డులపై 10 శాతం తగ్గింపు