Harish Rao Politics | రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్​రావు

సీఎం రేవంత్​రెడ్డి డైవర్షన్​ పాలిటిక్స్​ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Politics | సీఎం రేవంత్​రెడ్డి డైవర్షన్​ పాలిటిక్స్​ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. గురువారం ఉదయం కేటీఆర్​ నివాసంలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్రేక్​ ఫాస్ట్​ మీటింగ్​లో పాల్గొన్నారు. అంతకు ముందు హరీశ్​రావు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని హరీశ్​రావు అన్నారు. 22A మీద, ఉద్యోగుల సమస్యలు, రైతులు, నిరుద్యోగుల సమస్య మీద చర్చ జరగకుండా సీఎం (CM Revanth Reddy) డైవర్షన్​ పాలిటిక్స్​ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సమస్యలపై చర్చించకుండా సెషన్​ మొత్తం సస్పెండ్ చేశారన్నారు.

Harish Rao Politics | సీఎం క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ నడిపే ఫేక్ అకౌంట్‌ను పట్టుకొని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారని హరీశ్​రావు పేర్కొన్నారు. ఆ దొంగ ఫేక్ అకౌంట్ మీద ఈ రోజు కంప్లైంట్ ఇస్తామన్నారు. ఆ ఫేక్ అకౌంట్‌లో పోస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్లే.. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫేక్ అకౌంట్ మీద తక్షణమే విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని డిమాండ్​చేశారు. ఫేక్ అకౌంట్ ఆధారంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇస్తామన్నారు.

Harish Rao Politics | వాళ్లే దాడి చేసి, కేసులు పెట్టారు

పోలీసులు తమపై దాడి చేసి, మళ్లీ తమ మీదే కేసులు పెట్టారని హరీశ్​రావు అన్నారు. దాడి చేసిన వాళ్లను వదిలేసి, బాధితులనే నిందితులుగా మార్చడం “దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు” ఉందని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులను, పురుష ఎమ్మెల్యేల చుట్టూ మహిళా పోలీసులను పెట్టారని చెప్పారు. తమను నిర్బంధించే ప్రయత్నం చేసి, తిరిగి కేసులు పెడుతున్నారన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చాక వీటిపై విచారణ జరుపుతామన్నారు. అక్రమ కేసులు పెట్టిన అధికారులు సైతం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: TPCC District Incharges | పలు జిల్లాలకు పీసీసీ అధికార ప్రతినిధుల నియామకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *