అక్షరటుడే, వెబ్‌డెస్క్: DCM Van Fire | మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డీసీఎం వ్యాన్‌లో మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు డీసీఎంలో ఉన్న 200 మేకలు సజీవ దహనం అయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ వద్ద జాతీయ రహదారి 44పై గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. 200లకు పైగా మేకల లోడ్‌తో వెళ్తున్న డీసెం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా డీజిల్ ట్యాంక్ పేలి, నిప్పురవ్వలు చెలరేగి మంటలు అంటుకున్నాయి. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, వాహనంలో తరలిస్తున్న మేకలన్నీ సజీవ దహనం అయ్యాయి.
DCM Van Fire | ఐదుగురికి గాయాలు
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పి వేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Harish Rao Politics | రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు