అక్షరటుడే వెబ్‌డెస్క్: RTC CCTV Cameras | తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar )సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీల నిఘాపై మంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సభలో చర్చ జరిగింది.
RTC CCTV Cameras | ఎలక్ట్రిక్ బస్సుల్లోనే సీసీటీవీలు..
ప్రస్తుతం సాధారణ ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. కేవలం కార్పొరేషన్ నడుపుతున్న ప్రీమియం మరియు ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రమే వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 153 (AIS) నిబంధనల ప్రకారం బస్సుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి కాదని ఆయన వివరించారు. ఈ చర్చలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో సీసీటీవీల ఏర్పాటుపై గతంలోనూ ప్రతిపాదనలు వచ్చాయని గుర్తుచేశారు. ముఖ్యంగా రిమోట్ ప్రాంతాలు, సుదూర గ్రామాలకు నడిచే బస్సుల్లోనూ సీసీ కెమెరాలు అమర్చే ఆలోచన ఏమైనా ఉందా అని మంత్రిని ప్రశ్నించారు.
RTC CCTV Cameras | గణేష్ ఉత్సవాలు..
గణేష్ నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి దాదాపు 50 నుంచి 60 లక్షల మంది భక్తులు వస్తారని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఆర్టీసీ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే సమావేశంలో ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నామని మంత్రి పొన్నం మరోసారి సభలో అంగీకరించారు.
ఇది కూడా చదవండి: DCM Van Fire | డీసీఎంలో మంటలు.. డ్రైవర్ సహా 200 మేకలు సజీవ దహనం