అక్షరటుడే, వెబ్డెస్క్: Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ క్రమంలో ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గణేశ్ నిమజ్జనం సెప్టెంబర్ 25న నిర్వహించనున్నారు. ఆ రోజు హైదరాబాద్ మెట్రో సేవలు అర్ధరాత్రి 1 గంట వరకు, ఎంఎంటిఎస్ రైళ్లు రాత్రంతా నడుస్తాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 15లోగా రోడ్డు పనులను పూర్తి చేయాలని, ప్రమాదకరమైన ఓవర్‌హెడ్ వైర్లను తొలగించాలని, నిమజ్జన మార్గాల వెంబడి నిరంతర వైద్య సహాయం అందేలా చూడాలని పోలీసులు అన్ని శాఖలను ఆదేశించారు.
Ganesh Immersion | భక్తులకు ఇబ్బందులు లేకుండా…
నిమజ్జనం రోజైన సెప్టెంబర్ 25న ప్రజా రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. భక్తులు, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలను నడపడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. MMTS రైళ్లను రాత్రిపూట కూడా ఈ కీలక స్టేషన్ల నుండి నడపాలని ప్రతిపాదించారు. నాంపల్లి, లక్డీకాపుల్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, బేగంపేట్ స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు.
ఇది కూడా చదవండి..: Army Arms Theft | ఆయుధాల చోరీ కేసు.. ముగ్గురు ఆర్మీ అధికారుల అరెస్ట్