అక్షరటుడే, వెబ్‌డెస్క్: KBR Park One Way | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం అమలులోకి వచ్చింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి వన్ వే అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేబీఆర్ నిత్యం ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. దీనిని నివారించడాని ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తోంది. వీటి పనుల కోసం వన్ వే అమలు చేస్తామని ఇటీవల పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా వన్ వే విధానం అమలు చేశారు. ఏడాదిన్నర పాటు వన్‌వే విధానం అమలు ఉంటుంది. పంజాగుట్ట నుంచి కేబీఆర్ పార్క్ సర్కిల్ ఎంట్రెన్స్ వరకే 2 వైపుల రాకపోకలు సాగుతాయి. పంజాగుట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు కేబీఆర్ పార్క్ వద్ద లెఫ్ట్ తిరగాలి.
KBR Park One Way | చెక్‌పోస్టు నుంచి..
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు వచ్చే వాహనాలకు వన్‌వే మాత్రమే ఉంటుంది. కేబీఆర్ పార్క్ వద్ద స్ట్రైయిట్ పంజాగుట్ట వెళ్లవచ్చు. కేబీఆర్ పార్క్ వద్ద రైట్‌కు కేన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ సర్కిల్, రోడ్ నం.92 వైపు వెళ్లొచ్చు. రోడ్ నం.45 వైపు నుంచి వచ్చే వాహనాలు చెక్‌పోస్టు వైపు వెళ్లాలి. రోడ్ నం.12 వాహనాలకు అగ్రసేన్ సర్కిల్ వద్ద రైట్‌టర్న్ తొలగించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు కొత్త ట్రాఫిక్ విధానానికి సహకరించాలని సిటీ పోలీసుల విజ్ఞప్తి చేశారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. 1000 మంది ట్రాఫిక్ సిబ్బంది ఆ మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Student Loan Harassment | విద్యార్థులే లక్ష్యంగా వడ్డీ దందా!