అక్షరటుడే, వెబ్డెస్క్: JNTU student clash | హైదరాబాద్ (Hyderabad)లోని జేఎన్టీయూలో విద్యార్థులు కర్రలతో కొట్టుకున్నారు. క్యాంపస్ బయట రెండు హాస్టళ్లకు చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
యూనివర్సిటీలో గురువారం రాత్రి తీజ్ వేడుకలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ విద్యార్థి అమ్మాయి పట్ల అనుచితంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో గొడవ ప్రారంభం అయింది. వాగ్వాదం తీవ్రం కావడంతో రెండు హాస్టళ్ల విద్యార్థులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
JNTU student clash | వీడియోల ఆధారంగా..
ఘర్షణ జరిగిన అనంతరం KPHB పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. 10 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన విద్యార్థులు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారని JNTUH విద్యార్థులు తెలిపారు. ఘర్షణకు దారితీసిన వ్యాఖ్యలు, హాస్టల్ వర్గాల మధ్య తదనంతర ఘర్షణతో సహా, ఈ ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇది కూడా చదవండి..: Teachers Non Teaching Duties | టీచరా.. డేటా ఎంట్రీ ఆపరేటరా..? బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు బిజీబిజీ..