Kaleshwaram Case | కాళేశ్వరం కేసు.. కేసీఆర్‌, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Case | కాళేశ్వరం ప్రాజెక్ట్​ (Kaleshwaram Project) కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావుకు ఊరటనిచ్చింది. పీసీ ఘోష్​ కమిషన్​ (PC Ghosh Commission) నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కమిషన్‌ రిపోర్టును నిలిపివేసింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) ఘోష్​ కమిషన్​ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ సుదీర్ఘంగా విచారణ చేపట్టి అప్పటి సీఎం కేసీఆర్ (KCR)​, హరీశ్​రావు సహా పలువురు అధికారుల తప్పిదాలతో ప్రాజెక్ట్​లో అక్రమాలు చోటు చేసుకున్నాయని 2025 జులైలో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు (Harish Rao), ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్‌ మాజీ అధికారి ఎస్‌.కె.జోషిలు హైకోర్టు (High Court)లో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంతోనే విచారణ ముగియగా.. తాజాగా తుది తీర్పు వెల్లడించింది.

Kaleshwaram Case

Kaleshwaram Case | ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

పీసీ ఘోష్ కమిషన్​ను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని న్యాయస్థానం పేర్కొంది. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. కమిషన్​ నివేదికపై స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Heatwave Alert | మళ్లీ పెరగనున్న ఎండల తీవ్రత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *