Ceasefire Extension | కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ట్రంప్​ ప్రకటన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ceasefire Extension | ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. యుద్ధాన్ని ముగించేందుకు ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకురావడానికి టెహ్రాన్​కు మరింత సమయం ఇచ్చేందుకు దాడిని వాయిదా వేశామన్నారు.

అమెరికా, ఇరాన్​ మధ్య గతంలో సీజ్​ఫైర్​ ఒప్పందం (Ceasefire Agreement) కుదిరిన విషయం తెలిసిందే. రెండు వారాల ఒప్పందం నేటితో ముగిసింది. ఈ క్రమంలో తమ ప్రతిపాదనలకు అంగీకరించకపోతే ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్​ మంగళవారం ప్రకటించారు. కాల్పుల విరమణను పొడిగించే ప్రసక్తే లేదన్నారు. అయితే తాజాగా ఆయన మరోసారి వెనక్కి తగ్గారు. పాకిస్థాన్​ (Pakistan) అభ్యర్థన మేరకు సీజ్​ఫైర్​ పొడగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Ceasefire Extension

Ceasefire Extension | సంసిద్ధంగా ఉండాలి

దిగ్బంధనాన్ని కొనసాగించాలని, అన్ని ఇతర విషయాలలో సిద్ధంగా, సమర్థవంతంగా ఉండాలని తమ సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్​ తెలిపారు. వారి ప్రతిపాదన సమర్పించి, చర్చలు ఒక కొలిక్కి వచ్చేంత వరకు కాల్పుల విరమణను పొడిగిస్తానని తెలిపారు. అయితే సీజ్​ఫైర్​ ఎన్నిరోజులు అని ట్రంప్​ ప్రకటనలో పేర్కొనలేదు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించలేదు. కాల్పుల విరమణను పొడిగించడానికి అంగీకరించినందుకు ట్రంప్‌కు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) కృతజ్ఞతలు తెలిపారు, ఈ సంఘర్షణకు చర్చల ద్వారా పరిష్కారం కోసం ఇస్లామాబాద్ ప్రయత్నిస్తుందన్నారు. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పొడిగించడంతో పాటు చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఇరాన్‎పై దాడులు  నిలిపి వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు బ్రేక్ పడింది.

ఇది కూడా చదవండి..: US Iran Tensions | ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం.. ఇరాన్ క్షిపణి రహస్యాలను బయటపెట్టిన అమెరికా నేవీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *