US Iran Tensions | ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం.. ఇరాన్ క్షిపణి రహస్యాలను బయటపెట్టిన అమెరికా నేవీ!

Naresh Chandan
US Iran Tensions

అక్షరటుడే, వెబ్​డెస్క్: US Iran Tensions | ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత తారాస్థాయికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. United States Navy.. ఇటీవల ఇరాన్‌కు సంబంధించినదిగా అనుమానిస్తున్న ఒక సరకు రవాణా నౌకను తమ అధీనంలోకి తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.

US Iran Tensions | ప్రమాదకర రసాయనాలు

ప్రాథమిక సమాచారం ప్రకారం.. సదరు ఇరాన్​ నౌకలో పెద్ద మొత్తంలో అమ్మోనియం పర్‌క్లోరేట్, సోడియం క్లోరేట్, సోడియం పర్‌క్లోరేట్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు ప్రచారంలోకి వచ్చింది.

ఇవి సాధారణంగా క్షిపణి తయారీలో ఉపయోగించే అతి కీలక పదార్థాలు. ఇదే నిజమైతే.. Iran తన బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తున్నదా..? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చర్యను అమెరికా భద్రతాపరమైన జాగ్రత్తగా పేర్కొంటుండగా.. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Iran US 1

US Iran Tensions | భారీ స్థాయిలో ఘర్షణ

ఒకవైపు క్షిపణి సాంకేతికత అభివృద్ధి, మరోవైపు అణు కార్యక్రమాలపై అనుమానాలు—ఇవి కలిపి భవిష్యత్తులో భారీ స్థాయిలో ఘర్షణలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి పరిణామాలు కొనసాగితే, మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ శాంతి, భద్రతల దృష్ట్యా ఈ అంశం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

ఇది కూడా చదవండి: Iran US Tensions | హర్ముజ్​లో మరోసారి ఉద్రిక్తత.. ఇరాన్​ నౌకపై అమెరికా కాల్పులు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *