అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nepal Floods | నేపాల్‌లో మరోసారి వరదలు బీభత్సం సృష్టించాయి. మెరుపు వరదలతో గోర్ఖాలోని సల్లెరి బజార్ కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
భారీ వరదలతో అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నది పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. ఖాట్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రి గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో బుధి గండకి నదికి అడ్డుకట్ట పడింది. దీంతో దిగువ ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఆగస్టులో నేపాల్‌లో వచ్చిన వరదలతో 1,457 మంది మరణించగా, వేలాది మంది ఇప్పటికీ గల్లంతయ్యారు.
Nepal Floods | కొట్టుకుపోయిన వంతెనలు
తాజాగా వరదలతో రెండు సస్పెన్షన్ వంతెనలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ ప్రాజెక్ట్ దెబ్బతిందని అధికారులు తెలిపారు. గోర్ఖా, తనాహున్, చిత్వాన్, తూర్పు నవల్పరాసి, పశ్చిమ నవల్పరాసి జిల్లాల్లోని నదీ తీర ప్రాంత ప్రజలను జాతీయ అధికారులు అప్రమత్తం చేశారు. సైన్యం, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరద బీభత్సం..
నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలో బుధిగండకి నదిలో ఆకస్మిక వరదలతో ఉప్పొంగింది. వరద ఉధృతికి సల్లేరి బజార్ కొట్టుకుపోగా.. జగత్ మార్కెట్‌తో పాటు పలు నివాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎగువ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నది ప్రవాహానికి అడ్డంకి ఏర్పడడంతో ఒక్కసారిగా వరద పోటెత్తినట్లు అనుమానిస్తున్నారు. ఇళ్లు, హోటళ్లు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి.#nepal #flashfloods #floodalert #worldnews #aksharatoday
— Akshara Today | Telugu News (@AksharaToday) October 11, 2026
దీనిని కూడా చదవండి : Koukour Girl Murder | సికింద్రాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల బాలిక హత్య!