Iran Embassy Post | రెచ్చగొట్టేలా ఇరాన్ పోస్ట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిటన్

Balla Sandeep Kumar

అక్షరటుడే, లండన్: Iran Embassy Post | అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, బ్రిటన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iran Embassy) చేసిన పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. శత్రువుల ముందు తలవంచే ప్రసక్తే లేదని, దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలని యూకేలో ఉంటున్న తమ దేశ పౌరులకు ఎంబసీ పిలుపునిచ్చింది.

Iran Embassy Post | ఎంబసీ పోస్ట్:

దేశాన్ని శత్రువులకు అప్పగించే కంటే బలిదానానికి సిద్ధపడటం మేలని, స్వచ్ఛందంగా ప్రాణాలు అర్పించే వారు తమను సంప్రదించాలని ఎంబసీ తన పోస్ట్‌లో పేర్కొంది.

Iran Embassy Post | బ్రిటన్ ఆగ్రహం:

ఈ పోస్ట్ ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ బ్రిటన్ ప్రభుత్వం (Britan Government) తీవ్రంగా స్పందించింది. బ్రిటన్ గడ్డపై ఉంటూ ఇలాంటి హింసాత్మక ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇరాన్ రాయబారి సయ్యద్ అలీ మౌసావికి సమన్లు జారీ చేసింది. అయితే, తమ పోస్ట్‌పై ఇరాన్ రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. ఇది కేవలం దేశభక్తిని చాటే అంశమని, మాతృభూమి పట్ల ఉన్న విధేయతను తెలియజేస్తుందని పేర్కొంది. తాము హింసను ప్రోత్సహించడం లేదని సమర్థించుకుంది.

విషయం: యుద్ధం వస్తే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంబసీ చేసిన తాజా ప్రకటన యూరోపియన్ దేశాల్లో భద్రతా పరమైన ఆందోళనలను పెంచుతోంది.

ఇది కూడా చదవండి..: Trump Iran Strategy | ఇరాన్‌పై ట్రంప్ వ్యూహం.. ఆర్థిక దిగ్బంధమే లక్ష్యం! 

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *