ATM Theft | దొంగల హల్​చల్​.. ఏటీఎంలో చోరీ

గాంధారి మండల కేంద్రంలోని ఎస్​బీఐ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే గాంధారి : ATM Theft | గాంధారి మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎం కేంద్రంలో చొరబడి చోరీ చేశారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ATM Theft | స్కార్పియోలో వచ్చి..

కామారెడ్డి– బాన్సువాడ ప్రధాన రహదారిపై ఎస్​బీఐ ఏటీఎం (SBI ATM) ఉంది. శనివారం రాత్రి స్కార్పియో వాహనంలో దొంగలు వచ్చారు. అనంతరం గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఎంత మొత్తం నగదు పోయిందనే వివరాలు తెలియరాలేదు. అనంతరం దొంగలు పరారు అయ్యారు. పూర్తి వివరాల కోసం స్థానిక ఎస్సై మహేందర్​కు పలుమార్లు చరవాణిలో సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దీనిని కూడా చదవండి : Riyadh Airport Attack | రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. 12 మంది దుర్మరణం.. 300 మందికి పైగా గాయాలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *