Armoor Alumni Reunion | 45 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు

ఆర్మూర్​ జిల్లా పరిషత్ పాఠశాల 1981- 82 బ్యాచ్​ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Alumni Reunion | దేశవిదేశాలు దాటి.. ఎక్కడెక్కడో స్థిరపడి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తున్న పూర్వ విద్యార్థులు 45ఏళ్ల తర్వాత ఒకే చోట కలిశారు. ఆర్మూర్​(Armoor) పట్టణంలోని నటరాజ్​ ఫంక్షన్​ హాల్​ దీనికి వేదికైంది.

Armoor Alumni Reunion | ఆర్మూర్​ జిల్లా పరిషత్​ పాఠశాలలో..

పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాల్​లో ఆదివారం 1981- 82 ఎస్సెస్సీ బ్యాచ్​ పూర్వ విద్యార్థుల స్నేహ సమ్మేళనం నిర్వహించారు. 45 ఏళ్ల కిందట ఆర్మూర్​లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతిలో ఏ,బీ,సీ,డీ,యూ సెక్షన్లలో 245 మంది విద్యార్థులు కలిసి చదువుకున్నారు. వారిలో అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మరికొందరు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

Armoor Alumni Reunion | ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకొని, బ్యాచ్​లతోపాటు అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడిపాడి రోజంతా సంతోషంగా గడిపారు. స్నేహితులందరూ కలిసి సామూహిక భోజనం చేసి కబుర్లు చెప్పుకున్నారు.  పూర్వ విద్యార్థులు జైకిషన్, నారాయణ, అల్జాపూర్ చంద్రప్రకాష్, దొండి మహేష్ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వ్యాఖ్యాతగా దొంద రాములు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నారాయణ, ప్రదీప్ గుప్తా, బాలకృష్ణ ప్రసాద్, జగదీశ్వర్ వర్మ, చరణ్, చిన్నయ్య, కర్తన్ విజయ్ పాల్, రూపాలి మురళి, చేపూర్ నాగేందర్, దొండి మహేశ్వర్, సాత్​పుతే శ్రీనివాస్, జనార్ధన్ చంద్రశేఖర్, అల్జాపూర్ రమేష్, చంద్రయ్య, ఎంజే కుమార్, చిన్నయ్య, గణేష్, అల్జాపూర్ చంద్ర ప్రకాష్, పడాల్ విజయ్, దొండి గణేష్, బాస ప్రసాద్, కమ్ముల గంగాధర్, వైద్య రవీందర్, డీజే గంగా మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అశుతోష్ రాంకా అరెస్ట్​ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *