అక్షరటుడే, ఇందూరు: Jenda Jatara Nizamabad | నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం జెండా జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జాతరలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhannpal Suryanarayana) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Jenda Jatara Nizamabad | ఏళ్లుగా ఇందూరులో జెండా పండుగ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందూరులో ఏళ్లుగా జెండా జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భాద్రపద మాసంలో వినాయకచవితికి ముందు జెండా జాతర ప్రారంభం అవుతుందన్నారు. జెండా ఆలయం నుంచి శోభాయాత్రగా పూలాంగ్ వరకు కొనసాగి, అక్కడ వారం రోజులపాటు ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ0 దర్శించుకొని వేంకటేశ్వర స్వామి కృపాకటక్షాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, మల్కాయి మహేందర్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మోహన్ బాబుతో పనిచేయడం నా లైఫ్‌టైం అచీవ్మెంట్.. – ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల