అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Errapati Srinu | నిజామాబాద్ పోలీసు (Nizamabad Police) అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నికయ్యారు. అసోసియేషన్‌కు సంబంధించిన ఎన్నికలు నగరంలోని సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.
సమస్యల పరిష్కారానికి కృషి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు సంఘంలో మొత్తంగా 40మంది సభ్యులు ఉన్నారు. వీరి మధ్య ఎన్నిక నిర్వహించగా.. అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నికయ్యారు. అనంతరం పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా శీను మాట్లాడుతూ.. పోలీసుల సమస్యల పరిష్కారానికి సంఘం తరపున కృషి చేస్తామన్నారు. ఉన్నతాధికారుల మద్దతుతో ముందుకు వెళ్తామన్నారు.
ఇది కూడా చదవండి..: Boys Observation Home | విద్యార్థులకు సరైన భోజన వసతి కల్పించాలి..