Nizamabad Police | నగరంలో దారుణం.. రెండున్నర నెలల బాలుడిని హత్య చేసిన తండ్రి..

కన్నతండ్రే కాలయముడిగా మారాడు. రెండున్నర నెలల తన కొడుకుని నగరంలోని రైల్వే ట్రాక్ సమీపంలో దారుణంగా హత్య చేశాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police | కన్నతండ్రే కాలయముడిగా మారాడు. రెండున్నర నెలల తన కొడుకుని నగరంలోని (nizamabad) రైల్వే ట్రాక్​(Railway Track) సమీపంలో నిర్దయగా హత్య చేశాడు. ఈ అమానుష ఘటన నగరంలో కలకలం రేపింది.

Nizamabad Police | మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో..

నగరంలోని మిర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన యువరాజ్​ దంపతులకు రెండున్నర నెలల బాబు ఉన్నాడు. కానీ ఈ బాబు తనకు పుట్టలేదని అనుమానంతో అతడు నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నగరంలోని రైల్వే ట్రాక్ పక్కకు బాబును తీసుకొచ్చి కత్తితో నరికి హత్య చేశాడు. రైల్వే ట్రాక్ పక్కన బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన ఎస్​హెచ్​వో రఘుపతి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

railway 1

ఇది కూడా చదవండి : NEET Re Exam | నీట్​ పరీక్షకు లైన్​ క్లియర్​.. రీ-ఎగ్జామ్‌పై జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు

 

Child Murder, Nizamabad Crime, Crime News, Railway Track Incident, Police Investigation, Telangana News, Family Tragedy, Breaking News

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *