Dubba High School | విద్యార్థుల అవస్థలు సర్కారుకు పట్టవా..?

నిజామాబాద్​ నగరంలోని దుబ్బ హైస్కూల్​లో అసౌకర్యాలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా అధ్యక్షురాలు అనిత, నగర నాయకురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Dubba High School | నగరంలోని దుబ్బ హైస్కూల్​లో అసౌకర్యాలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా అధ్యక్షురాలు అనిత, నగర నాయకురాలు శ్రీదేవి ప్రశ్నించారు. వారు పాఠశాలను శుక్రవారం సందర్శించారు.

Dubba High School | మైదానంలో నిలబడే జాగా లేదు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుబ్బా ప్రభుత్వ పాఠశాల (Dubba Government School)లో వర్షం పడితే గ్రౌండ్​లో కనీసం నిలబడే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్​లో 450 మంది పిల్లలు ఉన్నారని.. అయితే బాత్రూంలు మాత్రం రెండే ఉన్నాయన్నారు. ఆడపిల్లలు వాష్​రూంకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలురు తప్పనిపరిస్థితుల్లో స్కూల్​ బయటకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీంతో చుట్టపక్కల వాళ్లు విద్యార్థులను దూషిస్తున్నారని ఆమె వాపోయారు.

Dubba High School

అలాగే తరగతి గదుల్లో టైల్స్​ పూర్తిగా ధ్వంసమయ్యాయని.. ఇవి తగిలి విద్యార్థులు గాయాలపాలవుతున్నారని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలు చిరిగిపోయాయని.. అలాగే తరగతి గదుల్లో బెంచీలు కూడా సరిగ్గా లేవన్నారు. విద్యార్థులకు నాసిరకమైన దుస్తులు పంపిణీ చేయడంతో వారు వేసుకున్న కొన్నిరోజులకే చిరిగిపోయాయని వారు తెలిపారు. విద్యార్థులకు నీటి సౌకర్యం కూడా లేదని.. దీంతో భోజన సమయంలో అవస్థలు పడుతున్నారన్నారు. బాలికలు వాష్​రూంలు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.

ఇది కూడా చదవండి..: Jagtial Kendriya Vidyalaya | జగిత్యాలలో కేంద్ర విద్యాలయానికి పదెకరాల స్థలం కేటాయించాలి..: ఎంపీ అర్వింద్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *