Jagtial Kendriya Vidyalaya | జగిత్యాలలో కేంద్ర విద్యాలయానికి పదెకరాల స్థలం కేటాయించాలి..: ఎంపీ అర్వింద్​

జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ అర్వింద్​ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Jagtial Kendriya Vidyalaya | జగిత్యాల (Jagtial)లో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని ఎంపీ అర్వింద్​ (MP Arvind) అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Jagtial Kendriya Vidyalaya | పదెకరాలు కేటాయిస్తే బాగుండేది..

విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు ఎంపీ తెలిపారు. కేంద్రీయ విద్యాలయ సంఘం (KVS) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరమే కాగా, మెట్రో నగరాల వెలుపల ఉన్న కేంద్రీయ విద్యాలయాలకు 10 ఎకరాలు అనువైన ప్రమాణమని ఆయన పేర్కొన్నారు. అదనపు భూమి ఉంటే విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, భవిష్యత్తు విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు.

Jagtial Kendriya Vidyalaya

ఇది కూడా చదవండి..: Kamareddy Heavy Rain | కామారెడ్డిలో కుండపోత.. రోడ్లపైకి చేరిన నీరు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *