Indiramma Dheema Scheme | నవంబర్​ 19 నుంచి ‘ఇందిరమ్మ ధీమా’ పథకం

ప్రతి కుటుంబానికి బీమా అందించే ఇందిరమ్మ ధీమా పథకాన్ని నవంబర్​ 19 నుంచి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Dheema Scheme | పార్టీ సిద్ధాంతాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బూత్ లెవెల్ ఏజెంట్లే (BLA) పార్టీకి మూలస్తంభాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఆదివారం ఆయన బీఎల్​ఏలతో సమావేశం నిర్వహించారు.

పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపున లభిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. పేదలకు కార్పొరేట్​ వైద్యం అందించేందుకు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తించారు. అలాగే ప్రతి కుటుంబానికి ఉచితంగా రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించే ‘ఇందిరమ్మ ధీమా’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభిస్తామని ప్రకటించారు.

Indiramma Dheema Scheme | విద్యార్థులకు అల్పాహారం

విద్యారంగం బలోపేతం కోసం అనేక చర్యలు చేపట్టినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో టీపీసీసీ పరిశీలకుడు దుద్దిళ్ల శ్రీను బాబు, నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : India Squash Medals | ఆసియా గేమ్స్​.. స్క్వాష్​లో భారత్​కు రెండు రజత పతకాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *