అక్షరటుడే, ఇందూరు: Voter Revision Survey | జిల్లావ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియను పక్కాగా జరిగే విధంగా కాంగ్రెస్ మండలాధ్యక్షులు కృషి చేయాలని డీసీసీ (DCC Nizamabad) అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన జిల్లాలో కాంగ్రెస్ మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.
Voter Revision Survey | ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా..
నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. డీసీసీ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు వివిధ మండలాలలో సర్ ప్రక్రియలో బాధ్యులుగా నియమించామన్నారు. ప్రతి మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ తమ మండలాలలో సర్వే ప్రక్రియ వందశాతం సక్రమంగా జరిగే విధంగా చూడాలన్నారు. ఏ ఒక్క ఓటు కూడా పోకుండా అందరూ ఎన్యుమరేషన్ ఫారాలు నింపే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి బూత్‌లో ప్రజలకు ఎన్యూమరేషన్ ఫామ్‌లు నింపడంలో బీఎల్ఏలకు సహాయపడాలని సూచించారు.
Voter Revision Survey | ఇబ్బందులు ఉన్నచోట..
ఇబ్బందులు ఉన్న దగ్గర పార్టీ నుంచి ఒకరిని బీఎల్వోలకు ఇచ్చి ఫారాలు నింపే విధంగా చూడాలన్నారు. ఈనెల 25వ తేదీ వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సర్వే ప్రక్రియలో చిత్తశుద్ధితో పాల్గొనాలని అన్నారు. జిల్లాలోని ఆర్మూర్(Armoor), బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా కోశాధికారి భక్తవత్సలం, డీసీసీ ఉపాధ్యక్షుడు తారా చాంద్, రత్నాకర్ గౌడ్, గోపి, రజిత యాదవ్, పాషా, అమృతాపూర్ గంగాధర్, బాలరాజు, చట్ల నరేష్, ముస్కు వెంకట రామ్ రెడీ, మేక వీర్రాజు వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.