Telangana University | తెయూ విద్యార్థులకు  క్యాంపస్​ ప్లేస్​మెంట్లు..

తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​ సాధించారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్​ ప్లేస్​మెంట్స్(Campus Placements)​ సాధించారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు.

Telangana University | బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో..

బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్(Hyderabad), జీనోమ్ వ్యాలీలోని ఇచోర్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి క్యాంపస్ ప్లేస్‌మెంట్ నిర్వహించారు. ఇచోర్ బయోలాజిక్స్ సంస్థ ప్రతినిధులు గణేష్, నవీన్ కుమార్, ఫణీంద్ర హాజరయ్యారు. బయోటెక్నాలజీ, బోటనీ, జువాలజీ విభాగాల ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టగా 12 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను విభాగాధిపతి ప్రసన్న శీల, అధ్యాపకులు అభినందించారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఇచోర్ బయోలాజిక్స్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Telangana University | సీపీగెట్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

intr

ఈనెల 15వ తేదీ వరకు జరిగే సీపీగెట్-2026 (CPGET-2026) ప్రవేశ పరీక్షలను నిరంతరం పర్యవేక్షించాలని ఏవీ ఎంటర్‌ప్రైజెస్ సీబీటీ ఎగ్జామ్ సెంటర్ ఛైర్మన్ ఆయుబ్ బిన్ హబీద్, కాకతీయ ఇన్‌స్టిట్యూషన్ ప్రధానాచార్యులు మహమ్మద్ ఫరీదుద్దీన్ బుధవారం కోరారు. ఈమేరకు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి సూచించారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న ఈ సెంటర్ ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.

Telangana University | పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన వీసీ

తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సుల 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్ష కేంద్రాన్ని వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తనిఖీ చేశారు. ఉదయం జరిగిన పరీక్షలకు 52 మంది విద్యార్థులకు 48 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 35 మంది విద్యార్థులకు 32 మంది హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: #Ladakh : లేహ్ ఎయిర్ పోర్టు నిర్మాణం చివరికి చేరుకుంది. దీనిని త్వరలో ప్రారంభించనున్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *