అక్షరటుడే వెబ్‌డెస్క్: US Iran Conflict | జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ తీవ్రతరమైంది. ఈ ఘటనకు ప్రతీకారంగా అమెరికా బలగాలు వరుసగా ఎనిమిదో రాత్రి కూడా ఇరాన్‌పై దాడులను కొనసాగించాయి.
US Iran Conflict | అమెరికా ఆపరేషన్ లక్ష్యం..
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు జరిగాయి. జోర్డాన్‌లో అమెరికా సైనికులపై దాడి చేసిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) బలగాలను దెబ్బతీయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం. అంతేకాకుండా, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా బలహీనపరచడమే ఈ దాడుల లక్ష్యమని అమెరికా స్పష్టం చేసింది.
US Iran Conflict | ఇరాన్ ప్రతిదాడి..
అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులకు దిగింది. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ఆదివారం అధికారికంగా ధృవీకరించింది. ముఖ్యంగా, కువైట్‌లోని క్యాంప్ ఉదైరిలో ఉన్న మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రంపై, అలాగే అలీ అల్ సలేం ఎయిర్ బేస్‌లోని పేట్రియట్ రాడార్ వ్యవస్థ , వైమానిక నిఘా రాడార్‌పై ఇరాన్ డ్రోన్లు మెరుపు దాడులు జరిపి వాటిని ధ్వంసం చేశాయి. అమెరికా చర్యలకు బదులుగానే తాము ఈ ఆపరేషన్ చేపట్టామని ఇరాన్ ప్రకటించడంతో, పశ్చిమాసియాలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది.
ఇది కూడా చదవండి: Ayodhya Donation Theft | అయోధ్యలో వేల కోట్ల చోరీ.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ