అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PV Sindhu Japan Open | భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు సుదీర్ఘ నిరిక్షణకు తెరదించింది. సుమారు రెండేళ్ల తర్వాత తన ఖాతాలో మరో టైటిల్ వేసుకుంది. టోక్యోలో ఆదివారం జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఘన విజయం సాధించింది.
పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్ విజేతగా నిలవడం గమనార్హం. జపాన్‌కు చెందిన అకానె యమగుచితో ఆదివారం ఉదయం జరిగిన ఫైనల్లో సింధు తెలుపొందింది. అద్భుత ప్రదర్శనతో 21-17, 21-17 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కూడా ఆమె నిలిచింది. సింధు చివరి టైటిల్‌ను 2024లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌లో గెలుచుకుంది. 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత పీవీ సింధుకు ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆమె తాజా టైటిల్‌తో సత్తా చాటింది.
PV Sindhu Japan Open | ఆరంభం నుంచే..
సింధు ఆరంభం నుంచే ఆటపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆమె సునాయాసంగా ఫోర్‌కోర్ట్‌పై పట్టు సాధించి, దూకుడుగా దాడి చేసింది. యమగుచిని కట్టడి చేస్తూ వరుస సెట్లలో విజయం సాధించింది. మొదటి గేమ్ 11-11 వరకు హోరాహోరీగా సాగింది. ఆ తర్వాత సింధు 16-12 ఆధిక్యానికి దూసుకుపోయింది. 17-15 వద్ద వారిద్దరూ 38-షాట్ల ర్యాలీ ఆడారు. రెండో గేమ్‌లో సైతం సింధు ఆరంభంలోనే పట్టు సాధించి, విరామ సమయానికి 11-7 ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ఆధిక్యాన్ని పెంచుకొని టైటిల్‌ను గెలుచుకుంది.
PV SINDHU WINS THE JAPAN OPEN! 🏆🥹 pic.twitter.com/7VzPeS7MeQ
— The Khel India (@TheKhelIndia) July 19, 2026
దీనిని కూడా చదవండి : Amarnath Yatra Halts | నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
I want to give New’s regular in this paper