Ayush Shetty Victory | ప్రపంచ నంబర్‌ వన్‌పై ఆయుష్ శెట్టి సంచలన విజయం

రెండో గేమ్‌లో షి యుకి పుంజుకుని 21-13తో గెలిచి మ్యాచ్‌ను సమం చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ayush Shetty Victory | ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించారు.

ప్రపంచ నంబర్‌ వన్, డిఫెండింగ్‌ ఛాంపియన్ షి యుకి (చైనా)పై అద్భుత విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఆయుష్ శెట్టి 21-14, 13-21, 21-19 తేడాతో షి యుకిని ఓడించి తదుపరి దశకు దూసుకెళ్లారు.

Ayush Shetty Victory | మూడో గేమ్‌పై ఉత్కంఠ

తొలి గేమ్‌లో ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ఆయుష్ 21-14తో గేమ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే రెండో గేమ్‌లో షి యుకి పుంజుకుని 21-13తో గెలిచి మ్యాచ్‌ను సమం చేశారు. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌పై ఉత్కంఠ నెలకొంది.

AI Shiva Song Balochistan | నెట్టింట మార్మోగుతున్న’శివ బోలో.. బలూచిస్తాన్ ఆజాద్’: ఏఐ సృష్టించిన అద్భుత ఆధ్యాత్మిక, సాంస్కృతిక గీతం!

మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడారు. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించిన ఆయుష్ శెట్టి 21-19తో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ నంబర్‌ వన్, ప్రస్తుత ఛాంపియన్‌పై విజయం సాధించడం ద్వారా ఆయుష్ తన సత్తాను చాటుకున్నారు.

Ayush Shetty Victory | పీవీ సింధు శుభారంభం

ఇక భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా టోర్నీలో శుభారంభం చేశారు. ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై వరుస గేముల్లో 21-7, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను సులువుగా ముగించారు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒకే రోజు ఆయుష్ శెట్టి, పీవీ సింధు విజయాలు సాధించడంతో భారత బ్యాడ్మింటన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *