IND v/c AFG 1st ODI | దుమ్మురేపిన భారత జట్టు.. తోక ముడిచిన ఆఫ్ఘన్​!

ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చేతిలో ఔట్​ అయ్యాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కేవలం 12 పరుగులు చేసి...

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND v/c AFG 1st ODI | ధర్మశాలలోని HPCA మైదానంలో ఆఫ్ఘనిస్తాన్​తో జరిగిన తొలి వన్డే (25 ఓవర్ల మ్యాచ్) లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్​లో భారత్​ 1-0 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.

IND v/c AFG 1st ODI | ఇషాన్ మెరుపులు

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. తదుపరి 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు సునాయాసంగా టార్గెట్​ను ఛేదించారు.

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఇద్దరు కూడా ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కాగా, 46 పరుగుల వద్ద రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. తదుపరి వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వచ్చి రావడంతోనే మెరుపు ఇన్నింగ్స్ ఇచ్చాడు.

వరుస బౌండరీలతో ఆఫ్ఘన్ బౌలర్లపై ఇషాన్​ చెలరేగుతున్న తరుణంలో..  ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చేతిలో ఔట్​ అయ్యాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కేవలం 12 పరుగులు చేసి, జియా ఉర్ రెహమాన్ షరీఫీ బౌలింగ్​లో బౌల్డ్ అయ్యాడు.

IND v/c AFG 1st ODI | రాహుల్ ఫినిషింగ్

ఇలా వికెట్లు పడిపోతున్నా.. కెప్టెన్ గిల్ క్రీజులోనే ఉంటూ ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు. శ్రేయస్ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లో (39 పరుగులు) 5 ఫోర్లు, 2 సిక్సర్లతో  మ్యాచ్​ను వన్ సైడ్​గా క్లోజ్​ చేశాడు.

Ali Khamenei Funeral | ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ ఖరారు

 

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *