Tata Group Bengal | బెంగాల్‌కు టాటాలను మళ్లీ తీసుకొస్తాం: సీఎం సువేందు అధికారి

పశ్చిమబెంగాల్‌లో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో భాగంగా టాటా గ్రూప్‌ను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tata Group Bengal | పశ్చిమబెంగాల్‌లో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో భాగంగా టాటా గ్రూప్‌ను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి ( Suvendu Adhikari ) ప్రకటించారు.

Tata Group Bengal |సుమారు 17 ఏళ్ల తర్వాత..

2008లో సింగూర్ నుంచి టాటా మోటార్స్ తన నానో ప్రాజెక్ట్‌ను నిలిపివేసిన తర్వాత, ఆ సంస్థ మళ్ళీ బెంగాల్ వైపు చూడలేదు. అప్పట్లో జరిగిన భూసేకరణ వివాదాలు, ఆందోళనల కారణంగానే టాటా గ్రూప్ తన కార్యకలాపాలను గుజరాత్‌కు తరలించాల్సి వచ్చింది. సుమారు 17 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక వైభవాన్ని మళ్లీ దక్కించుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సువేందు తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

suvendhu.1

 

Tata Group Bengal | సుప్రీంకోర్టు స్పందిస్తూ..

2006లో హుగ్లీ జిల్లా సింగూర్‌లో నానో కార్ల తయారీ కోసం అప్పటి ప్రభుత్వం దాదాపు వెయ్యి ఎకరాల భూమిని సేకరించింది. అయితే, దీనికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన తీవ్ర నిరసనల కారణంగా, 2008లో టాటా గ్రూప్ తన ప్రాజెక్టును బెంగాల్ నుంచి తరలించింది. ఆ తర్వాత 2016లో సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఆ భూసేకరణ ప్రక్రియ సక్రమంగా లేదని పేర్కొంటూ.. భూములను తిరిగి రైతులకు అప్పగించాలని తీర్పునిచ్చింది.

ఇది కూడా చదవండి: ABHA Health ID | ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ ‘ఆభా’.. క్లిక్ చేస్తే రోగి ఆరోగ్య చరిత్ర!

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *