అక్షరటుడే వెబ్‌డెస్క్: Sennes Milan Fashion Week | ప్రముఖ జ్యువెలరీ ( Jewelry )బ్రాండ్ ‘సెన్కో’కు చెందిన ల్యాబ్-గ్రోన్ డైమండ్ బ్రాండ్ ‘సెన్నెస్’ (Sennes) అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన ఘనత సాధించింది. సెప్టెంబర్ 2026లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత ‘మిలన్ ఫ్యాషన్ వీక్’లో ప్రముఖ డిజైనర్ ధ్రువ్ కపూర్ షోకు అధికారిక జ్యువెలరీ భాగస్వామిగా వ్యవహరించి ర్యాంప్‌పై అదరగొట్టింది. ఇప్పటికే 2026 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సెన్నెస్‌కు, ఈ మిలన్ ఫ్యాషన్ వీక్ భాగస్వామ్యం మరో పెద్ద అంతర్జాతీయ మైలురాయిగా నిలిచింది.
Sennes Milan Fashion Week | ప్రత్యేక ఆకర్షణగా ..
ఈ మిలన్ ఫ్యాషన్ ప్రదర్శనలో సెన్నెస్‌కు చెందిన ‘టోయ్ ఎట్ మోయ్ బై సెన్నెస్’ (Toi et Moi) కలెక్షన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫ్రెంచ్ భాషలో ‘టోయ్ ఎట్ మోయ్’ అంటే ‘నువ్వు – నేను’ అని అర్థం. రెండు వేర్వేరు రంగుల ల్యాబ్-గ్రోన్ వజ్రాలు తమ ప్రత్యేకతను కోల్పోకుండా, ఒకదానితో ఒకటి అందంగా మిళితం కావడం ఈ డిజైన్ ప్రత్యేకత. ఈ కలెక్షన్‌కు చెందిన నెక్లెస్‌లు, ఇయర్‌రింగ్స్, రింగ్స్, పెండెంట్లు, బ్రాస్‌లెట్లు వంటి సుమారు 71 ఆభరణాలను ర్యాంప్‌పై ఐదు విభిన్న లుక్స్‌లో ప్రదర్శించారు.
Sennes Milan Fashion Week | రెండు భిన్నమైన అంశాలు..
ఈ సందర్భంగా సెన్నెస్, సెన్కో గోల్డ్ & డైమండ్స్ డైరెక్టర్, మార్కెటింగ్ & డిజైన్ హెడ్ జోయిటా సేన్ మాట్లాడుతూ.. ‘టోయ్ ఎట్ మోయ్’ కలెక్షన్ ద్వారా రెండు భిన్నమైన అంశాలు ఎలా సుందరంగా కలిసిపోవచ్చో చూపించామన్నారు. డిజైనర్ ధ్రువ్ కపూర్‌తో ఉన్న అనుబంధం ద్వారా తమ డిజైన్ ప్రతిభను ప్రపంచ వేదికపై మరోసారి చాటుకునే అవకాశం దక్కిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Khairatabad Bypoll | ఖైరతాబాద్ ఉపఎన్నిక.. కిషన్ రెడ్డికి మరో అగ్నిపరీక్ష..!