Quality Seeds Supply | రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి

రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని రైతు సంక్షేమ కమిషన్​ సభ్యుడు గంగాధర్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Quality Seeds Supply | రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని రైతు సంక్షేమ కమిషన్​ సభ్యుడు గంగాధర్​ పేర్కొన్నారు. నగరంలోని పలు ఎరువులు, విత్తన దుకాణాల్లో ఆయన వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.

Quality Seeds Supply | పక్క రాష్ట్రాల నుంచి..

జిల్లాకు పక్క రాష్ట్రాల నుంచి విత్తనాలు సరఫరా జరుగుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. నిషేధిత గడ్డిమందులను విక్రయిస్తున్న కొందరు డీలర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని, అందుబాటులో ఉన్న రకాలను బోర్డుపై రాయాలని ఆదేశించారు. ఎవరైనా ఎరువుల కొరతను సృష్టించినా, అధిక ధరలకు యూరియా (Urea) అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులకు సంబంధించిన రశీదులను విధిగా తీసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Bheemgal Ganja Seizure | ఎక్సైజ్ దాడుల్లో గంజాయి పట్టివేత.. ముగ్గురు బైండోవర్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *