Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం

పోలీస్​ ప్రజావాణిలో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించారు.

Police Prajavani Complaints | 32 మంది బాధితుల నుంచి..

కార్యాలయంలో సోమవారం 32 మంది బాధితుల నుంచి సీపీ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశామన్నారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్​శాఖ పనిచేస్తుందని సాయిచైతన్య పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Parandur Airport Project | విమానాశ్రయం ప్రాజెక్ట్​ను రద్దు చేసిన సీఎం విజయ్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *