RI Caught by ACB | భూమి రిజిస్ట్రేషన్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ, జీపీవో

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ వేముగంటి పూర్ణచందర్​ రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RI Caught by ACB | యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా ఆలేరు మండల రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ వేముగంటి పూర్ణచందర్​ రావు, కొలనుపాక జీపీవో (GPO) షేక్​ అహ్మద్​ ఏసీబీ (ACB)కి చిక్కారు. భూమి రిజిస్ట్రేషన్​ కోసం లంచం తీసుకుంటుండగా.. అధికారులు వీరిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

కొలనుపాక రెవెన్యూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోదరి అమ్మిన భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి ఆర్​ఐ పూర్ణచందర్​రావు రూ.14 వేల లంచం డిమాండ్​ చేశాడు. జీపీవో అహ్మద్​ ద్వారా ఆయన లంచం అడిగాడు. పైసలు ఇస్తేనే రిజిస్ట్రేషన్​ అవుతుందని చెప్పాడు. దీంతో మహిళ సోదరుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి సోమవారం ఆర్​ఐ, జీపీవో రూ.14 వేల లంచం తీసుకుంటుండగా నల్గొండ యూనిట్​ ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్​ చేశారు.

RI Caught by ACB | జోరుగా అవినీతి

రాష్ట్రంలోని పలు తహశీల్దార్​ కార్యాలయాల్లో జోరుగా అవినీతి సాగుతోంది. అటెండర్​ నుంచి మొదలు పెడితే తహశీల్దార్​ వరకు లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా తహశీల్దార్లు కింది స్థాయి సిబ్బంది ద్వారా లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు అయితే లంచం తీసుకోవడం కూడా ఒక విధిగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

దీనిని కూడా చదవండి : Stock Market Losses | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *