అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Rising Global Summit | రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ సదస్సుకు సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ నిర్వహణకు కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. రాబోయే డిసెంబర్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.
Telangana Rising Global Summit | ప్రత్యేక ఏర్పాట్లు..
గత సంవత్సరం నిర్వహించిన సదస్సు కంటే ఈసారి మరింత విస్తృతంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో ఈ సమ్మిట్‌ను చేపట్టనున్నారు. దేశ విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులను ఆహ్వానించడంతో పాటు సన్నాహక ఏర్పాట్లను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్‌ను ఈ వేదిక ద్వారా ప్రపంచ పెట్టుబడిదారుల ముందుకు తీసుకెళ్లనున్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులను ఈ సదస్సులో ప్రధానంగా ప్రదర్శించనున్నారు.
Telangana Rising Global Summit | కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి:
డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్ వంటి ప్రధాన రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సును రూపొందిస్తున్నారు. అంతేకాకుండా, స్థానిక పరిశ్రమలు, స్టార్టప్‌ల విజయాలు, నూతన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi Defamation Case | రాహుల్ గాంధీకి ఊరట.. సావర్కర్ పరువునష్టం కేసు కొట్టివేత