Hormuz Strait Tensions | హర్మూజ్‌ జలసంధి మా కంట్రోల్‌లోనే: అమెరికా

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) రవాణా మార్గంపై ఇరాన్ చేసిన వ్యాఖ్యలను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hormuz Strait Tensions | అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) రవాణా మార్గంపై ఇరాన్ చేసిన వ్యాఖ్యలను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ జలమార్గంపై పూర్తి నియంత్రణ తమదేనని స్పష్టం చేస్తూ, ఇరాన్ ( Iran )చేస్తున్న వాదనలో నిజం లేదని తేల్చిచెప్పింది.

Hormuz Strait Tensions | అమెరికా జోక్యాన్ని సహించేది లేదు

హర్మూజ్ జలసంధి మీదుగా నౌకలు ప్రయాణించాలంటే తాము నిర్దేశించిన మార్గాలను మాత్రమే అనుసరించాలని ఇరాన్ ఇటీవల ప్రకటించింది. తమ జలాల్లో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని టెహ్రాన్ హెచ్చరించింది. ఇరాన్ మీడియాలో వచ్చిన ఈ వార్తలపై యూఎస్ సెంట్రల్ కమాండ్ (US Central Command) వెంటనే స్పందించింది.

harmuz.1 1

Hormuz Strait Tensions | అమెరికా స్పష్టత..

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌కు ఎలాంటి నియంత్రణ లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈ సంవత్సరం మే నెల నుంచి ఇప్పటివరకు సుమారు 800 వాణిజ్య నౌకలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా ప్రయాణించాయని వెల్లడించింది. ఈ నౌకల ద్వారా ఏకంగా 380 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు రవాణా జరిగిందని వివరించింది. ఈ జలమార్గంలో నౌకల రాకపోకలకు అమెరికా దళాలు పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఇరాన్ కొన్ని నౌకలను అడ్డుకుని వెనక్కి పంపినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, అగ్రరాజ్యం చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Hormuz Strait Tensions | కొనసాగుతున్న రాకపోకలు..

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉన్నప్పటికీ, హర్మూజ్ మీదుగా వాణిజ్య నౌకల రాకపోకలు యధావిధిగా సాగుతున్నాయి. తాజాగా కెప్లర్ షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఐదు ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు ఈ మార్గంలోకి ప్రవేశించాయి. వీటిలో ఖతార్‌కు చెందినవి నాలుగు ఉండగా, ఒకటి గ్రీక్ కంపెనీకి చెందినది. అదేవిధంగా, జులై 7 నుంచి 9 మధ్య జపాన్‌కు చెందిన 22 నౌకలు కూడా ఈ జలసంధి మీదుగా సురక్షితంగా ప్రయాణించినట్లు జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

ఇది కూడా చదవండి: Sugar Factory Pollution | చక్కెర ఫ్యాక్టరీపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *