Telangana Grain Procurement | సెక్రటేరియట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Grain Procurement | రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సెక్రటేరియట్ ముట్టడికి దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు పేరిట రైతులను నష్టపరచవద్దని, అన్నదాతలకు తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సచివాలయం పరిసరాల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవితతో పాటు పార్టీ శ్రేణులను, ఇతర నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Telangana Grain Procurement | ప్రజా సమస్యలపై కవిత పోరు..

కల్వకంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత, ఇటీవల కాలంలోనే ఆమె ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పేరిట సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీని ప్రారంభించిన నాటి నుండి ఆమె ప్రజా సమస్యలపై నిరంతరాయంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తూ.. ప్రెస్ మీట్లు, ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై స్పందిస్తూ రైతుల పక్షాన ఆమె ఈ ధర్నాకు దిగారు.

ఇది కూడా చదవండి: Tiger Attack Chandrapur | తునికాకు కోసం వెళ్లి.. పులి దాడిలో నలుగురు మహిళల మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *