Smart Ration Cards | రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక.. మూడు కొత్త స్కీంలు ప్రారంభం

రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా 3 కొత్త పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Smart Ration Cards | రాష్ట్ర ప్రజలకు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా 3 సంక్షేమ పథకాల పంపిణీకి (Telangana Welfare Schemes) కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చూడుతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు, నూతన పింఛన్ల పంపిణీని (New Pension Scheme) ఆ రోజు నుంచే ప్రారంభించనుంది. దీంతో పాటు అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా శనివారం నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

Smart Ration Cards | క్యూఆర్​ కోడ్​తో కూడిన రేషన్​కార్డ్స్​..

రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు అందజేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్​తో కూడిన 1.06 కోట్ల లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించారు. పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 54,66,844 కార్డులు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ఆహార భద్రత కింద 35,28,438 కార్డులు కలిపి మొత్తం 89,95,282 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,81,47,565 మంది లబ్ధిదారులు ఉన్నారు. 26 జనవరి 2025 నుంచి 21 జూలై 2026 మధ్య 16,32,810 కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు పాత కార్డుల్లో 20,27,519 కొత్త సభ్యుల పేర్లను చేర్చారు.

Smart Ration Cards | కామారెడ్డి జిల్లాకు 2.97 లక్షల స్మార్ట్ కార్డులు

సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. కామారెడ్డి జిల్లాకు ఇప్పటికే 2,97,293 స్మార్ట్ కార్డులు చేరినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 597 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆహార భద్రత కార్డులు – 2,34,730, అంత్యోదయ కార్డులు-17,664, అన్నపూర్ణ కార్డులు-901 ఉన్నాయి. ప్రభుత్వం నుంచి తుది మార్గదర్శకాలు రాగానే పంపిణీ చేయనున్నారు.

Smart Ration Cards | 15 నాటికి గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు

డెలివరీ బాయ్స్, రవాణా కార్మికుల భద్రత కోసం గిగ్ వర్కర్స్ చట్టాన్ని ఆగస్టు 15 నుంచే అమలు చేయాలని కార్మిక శాఖ నిర్ణయించింది. వేతన కోతలు, యాప్ అల్గారిథమ్స్​తో పేమెంట్లు నిలపడం, కారణం లేకుండా ఐడీలు బ్లాక్ చేయడం, అనవసర కోతలపై అగ్రిగేటర్లకు అడ్డుకట్ట వేసేలా కొత్త చట్టంలో కఠిన నిబంధనలు తెచ్చారు.

ఇది కూడా చదవండి: Amrit Bharat Express | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. కొత్తగా ఏడు అమృత్​ భారత్​ రైళ్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *