Indian Stock Market | నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Stock Market | అమెరికా -ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చితి, ముడి చమురు ధరలలో అస్థిరతతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుండడంతో స్టాక్ మార్కెట్లు నెగెటివ్ గా స్పందించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రధాన సూచీలలో రెండువారాల లాభాల పరంపరకు బ్రేక్‌లు పడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్ 0.62 శాతం, నిఫ్టీ 0.83 శాతం నష్టపోయాయి.

Indian Stock Market | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 20 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 239 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 65 పాయింట్లు తగ్గింది. చివరికి సెన్సెక్స్ 70 పాయింట్ల నష్టంతో 78,009 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 24,366 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,958 కంపెనీలు లాభపడగా 2,326 స్టాక్స్ నష్టపోయాయి. 218 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 159 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 99 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్ లాభపడగా.. 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎయిర్‌టెల్ 2.53 శాతం, అదానీ పోర్ట్స్ 1.82 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.57 శాతం, టైటాన్ 0.56 శాతం, ఎం అండ్ ఎం 0.35 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఆసియన్ పెయింట్ 1.69 శాతం, ఇండిగో 1.39 శాతం, ఎన్టీపీసీ 1.19 శాతం, పవర్‌గ్రిడ్ 1.08 శాతం, ఎస్బీఐ 1.04 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | నాలుగో రోజూ నష్టాల్లోనే సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *