Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flipkart Sale | షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. మండు వేసవిలో భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఈనెల 9 నుంచి ‘సాసా లేలే’ సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఈ మెగా సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ (SBI Credit) కార్డ్ లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ఈఎంఐ లావాదేవీలకూ వర్తించనుంది. బ్లాక్ కస్టమర్లకు 15 శాతం బ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్స్‌క్లూజివ్ డీల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Flipkart Sale | ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు..

ప్రధానంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల (Smartphones)పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25ఎఫ్ ఈ, గెలాక్సీ ఎస్ 25 ఫోన్లపై ప్రయోజనాలను అందించనుంది. రియల్ మీ పీ4ఎక్స్ 5జీ, వివో ఎక్స్ 200ఈ 5జీ, పోకో ఎఫ్ 7 5జీ వంటి కొత్త మోడల్ ఫోన్‌లు ఆకర్షణీయమైన ధరలకు లభించనున్నాయి.

Flipkart Sale | ల్యాప్ టాప్ లపైనా..

స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా మంచి డీల్స్ ఉండనున్నాయి. ఆసస్ ఎక్స్ పర్ట్ బుక్ పీ1, డెల్ జీ 1515, లెనోవో యోగా ఏఐ వంటి మోడళ్లు బడ్జెట్ ధరలో లభించనున్నాయి. అలాగే 55 అంగుళాల 4కే టీవీలు, ఏసీలూ డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఫ్యాషన్, వేసవికి సంబంధించిన వస్తువులపై 85 శాతం వరకు, కుక్‌వేర్‌పై 70 శాతం, ఫుడ్ ఐటమ్స్ 65 శాతం, ఫుట్‌వేర్‌పై 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే గృహోపకరణాలపై కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Flipkart Sale | డబుల్ డిస్కౌంట్ ఆఫర్స్..

పాత వస్తువులను ఇచ్చి కొత్తవి తీసుకునే వారికి డబుల్ డిస్కౌంట్ ప్రయోజనం కలుగుతుంది. రష్ అవర్ లో ప్రతి 12 గంటలకు కొత్త డీల్స్ వస్తాయి. బ్రాండ్ అవర్స్ ప్రతిరోజు రాత్రి 7 -11 గంటల వరకు నిర్వహిస్తారు. డబుల్ ఫ్లాష్ అవర్ సేల్స్ ఉదయం 10-11, మధ్యాహ్నం 3-4 గంటల మధ్య ఉంటాయి. వీటితో పాటు ప్రతి గంటకు టిక్‌టాక్ డీల్స్ కూడా ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి..: Auto Sales in India | ఆటో.. అదరహో.. రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *