అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Cybercrime Police | సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ( CV Anand ) అన్నారు. ‘సురక్షా కా తిరంగా’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రధాని కార్యాలయం (PMO) పర్యవేక్షించిన జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో తెలంగాణ సైబర్‌క్రైమ్ విభాగం, జిల్లా యూనిట్లు అత్యుత్తమ పనితీరు కనబరిచి దేశంలోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాయని వెల్లడించారు.
Telangana Cybercrime Police | పెరుగుతున్న సైబర్ ముప్పు..
సమాజంలో డ్రగ్స్, కల్తీ ఆహారంతో పాటు సైబర్ నేరాలు కూడా పెను ముప్పుగా మారుతున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, నిపుణులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మొత్తం సైబర్ నేరాల్లో సుమారు 60 శాతం కేవలం పెట్టుబడి మోసాలే (Investment Frauds) ఉంటున్నాయని, ఎంత ప్రచారం చేసినా ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపులు, నకిలీ కాల్స్‌ను నమ్మి ప్రజలు మోసపోతూనే ఉన్నారని పేర్కొన్నారు.
Telangana Cybercrime Police | డిజిటల్ అరెస్ట్ మోసాలకు చెక్..
గత ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో చేపట్టిన పటిష్ట చర్యల కారణంగా ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలను 70 శాతానికి పైగా విజయవంతంగా తగ్గించగలిగామని డీజీపీ తెలిపారు. రాబోయే రోజుల్లో పెట్టుబడి మోసాలు, సెక్స్‌టార్షన్, ఓటీపీ, కేవైసీ ఫ్రాడ్స్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tirumala Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ దర్శన కోటా విడుదల ఎప్పుడంటే?