Bathukamma Kunta | బ‌తుక‌మ్మ‌ కుంట ముమ్మాటికీ చెరువే : హైడ్రా క‌మిష‌న‌ర్‌

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bathukamma Kunta | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అంబ‌ర్‌పేట‌లో గల బ‌తుక‌మ్మ కుంట ముమ్మాటికీ చెరువే అని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Ranganath) అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు.

హైడ్రా కార్యాల‌యం (Hydraa Office)లో శ‌నివారం కమిషనర్​ మీడియాతో మాట్లాడారు. బతుకమ్మ కుంట వద్ద పేర్లను తొలగించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కుంటపై పలు పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కమిషనర్​ రంగనాథ్​ వివ‌ర‌ణ ఇచ్చారు. 1975లో ఇరిగేష‌న్ రికార్డుల్లో కుంట‌గా పేర్కొన్న ఆధారాల‌ను చూపించారు. స‌ర్వే నంబ‌రు 563/1 లో 9.19 ఎక‌రాల వ‌ర‌కూ చెరువున్నట్టు రెవెన్యూ, జీహెచ్ఎంసీ (GHMC) రికార్డుల్లో ఉందని తెలిపారు. బ‌తుక‌మ్మకుంటపై తుది తీర్పు వ‌చ్చే వ‌ర‌కూ దీనిమీద ఎవ‌రూ ఓన‌ర్‌షిప్‌ క్లెయిమ్ చేయ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ల మేర‌కు బోర్డులు, గేట్లు తొల‌గించామ‌ని స్పష్టం చేశారు. బండ్ల‌గూడలోని స‌ల్కం చెరువు విష‌యంలో కూడా కోర్టు హైడ్రాను త‌ప్పు ప‌ట్ట‌లేద‌న్నారు.

Bathukamma Kunta | చెరువులు ప్ర‌జ‌ల ఆస్తి

ప్రైవేటు ప‌ట్టానా.. ప్రభుత్వ ప‌ట్టానా అనేది లేకుండా చెరువుల‌న్నీ ప్ర‌జ‌ల సొత్త‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు. వాటి స్వరూపం మార్చడానికి వీలు లేదన్నారు. అక్క‌డ నిర్మాణాలు చేప‌డ‌తామంటే కుదరదని స్పష్టం చేశారు. మొదటి విడతలో ఆరు చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు. ఇందులో మూడింటిని ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. రెండో విడ‌త‌లో 14 చెరువుల పనులు చేపడుతామని వివరించారు. చెరువుల వద్ద నివాసాలు ఇళ్లు పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.

Bathukamma Kunta | 2,093 ఎక‌రాలు స్వాధీనం

హైడ్రా ఇప్ప‌టి వ‌ర‌కూ 2,093 ఎక‌రాలను స్వాధీనం చేసుకుంద‌ని కమిషనర్​ తెలిపారు. వీటి విలువ రూ. 85 వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఇళ్లు కూల్చే సమయంలో ముందుగా నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు. అయినా కూడా కొందరు ఖాళీ చేయడం లేదన్నారు. హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్ సుద‌ర్శ‌న్‌, ఏసీపీలు తిరుమ‌ల్, ఉమామ‌హేశ్వ‌ర‌రావు, శ్రీ‌కాంత్ పాల్గొన్నారు.

 దీనిని కూడా చదవండి : Attack with Helmet | హెల్మెట్​తో కొట్టిన అల్లుడు.. బైక్​పై నుంచి పడి మహిళ మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *