అక్షరటుడే, వెబ్‌డెస్క్: Attack with Helmet | బైక్‌పై వెళ్తుండగా వెనుక కూర్చున్న అత్తను హెల్మెట్‌తో కొట్టాడు ఓ వ్యక్తి. దీంతో ఆమె కింద పడి చనిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ (Medipally Police Station) పరిధిలో చోటు చేసుకుంది.
చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ (39)కు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చిన్న కుమార్తె కావ్య గతేడాది కరీంనగర్ (Karimnagar)కు చెందిన స్నేహిత్(28) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొంతకాలంగా స్నేహిత్‌కు, తన అత్త అరుణతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29 కావ్య తల్లి అరుణ(39)ను స్నేహిత్ బైక్‌పై తీసుకెళ్లాడు.
Attack with Helmet | వాగ్వాదం జరగడంతో..
బైక్‌పై వెళ్తుండగా అరుణ, స్నేహిత్ మధ్య గొడవ జరిగింది. కోపానికి గురైన అతడు తన హెల్మెట్‌తో అత్తను కొట్టాడు. దీంతో అరుణ కింద పడి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది.
Attack with Helmet | పట్టించిన సీసీ ఫుటేజీ
బైక్‌పై నుంచి అరుణ కింద పడగానే స్నేహిత్ నాటకం ఆడాడు. ఆమెకు ఫిట్స్ రావడంతో బండిపై నుంచి పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. బైక్ వేగంగా వెళ్తుండగా స్నేహిత్ తన హెల్మెట్‌తో ఆమెను బలంగా కొట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
28 year old Snehit from Karimnagar, Telangana fell in love with Kavya and was happily married her.
On 29th April Snehit took his mother-in-law Aruna on his bike from home. A little later he took his injured mother-in-law to the hospital saying she had an episode of epileptic… pic.twitter.com/V6pfeoPtS1
— Revathi (@revathitweets) May 2, 2026
ఇది కూడా చదవండి..: Medical Seat Scams | మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

