జాతీయంCooking Oil Price Rise | భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

Cooking Oil Price Rise | భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cooking Oil Price Rise | పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో గ్యాస్​ ధరలు (Gas Prices) భారీగా పెరిగాయి. త్వరలో ఇంధన ధరలు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు వంట నూనెల ధరలు (Cooking Oil Prices) సైతం భారీగా పెరిగాయి.

దేశంలో ఇప్పటికే ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. అనేక వస్తువుల ధరలు పెరిగాయి. తాజాగా ఆ జాబితాలోకి వంటనూనె సైతం చేరింది. యుద్ధం ప్రభావంతో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. యుద్ధం పేరు చెప్పి కొందరు వ్యాపారులు వంట నూనె కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అనంతరం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22 శాతం పెరగడం గమనార్హం.

Cooking Oil Price Rise | తీవ్ర ప్రభావం

ఇప్పటికే గ్యాస్​ సిలిండర్ల (Gas cylinders) ధరలు పెరిగాయి. మరోవైపు పప్పులు, కూరగాయల రేట్లు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో వంటింట్లో బడ్జెట్​ తారుమారు అవుతోంది. ఈ క్రమంలో వంట నూనె ధరలు సైతం పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. మరోవైపు హోటళ్లు, హాస్టళ్లలో కూడా దీని ప్రభావం ఉండనుంది. కమర్షియల్ గ్యాస్​ సిలిండర్ ధరలు పెంచడంతో ఇప్పటికే పలు హోటళ్లలో రేట్లు పెంచారు. వంట నూనె ధరలకు రెక్కలు రావడంతో హోటళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.

Cooking Oil Price Rise | పెరిగిన రేట్లు ఇలా..

సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో ధర రూ. 180 నుంచి రూ.200కు పెరిగింది. పామాయిల్ ధర రూ. 120 ఉండగా.. ఇప్పుడు రూ.145కు విక్రయిస్తున్నారు. వేరుశనగ నూనె రూ. 15 పెరిగింది. 5 కిలోల వేరుశనగ నూనె డబ్బా రూ. వెయ్యి నుంచి రూ. 1150కు చేరింది. 15 కిలోల టిన్ను(హోల్‍సేల్) రూ.2300 నుంచి రూ.2400 వరకు పెరిగింది.

ఇది కూడా చదవండి..: TMC Setback | మమత బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

 

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

IPL Betting Suicide | ఐపీఎల్ బెట్టింగ్​కు బలి.. ఆత్మహత్య చేసుకున్న వ్యాపారి

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL Betting Suicide | ఐపీఎల్​ బెట్టింగ్​ భూతానికి...

Drunk Driving Cases | మూడు వారాలు..432 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్...

Telangana Employees Protest | 5న ఉద్యోగుల సామూహిక నిరాహార దీక్ష

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Telangana Employees Protest | తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్...

Eatala Rajender comments | రాజకీయాల్లో తోసుకుంటూ పోవాల్సింటే : ఎంపీ ఈటల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eatala Rajender comments | మల్కాజ్​గిరి ఎంపీ...