Eatala Rajender comments | రాజకీయాల్లో తోసుకుంటూ పోవాల్సిందే..: ఎంపీ ఈటల

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eatala Rajender comments | మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తొలగి తోవ ఎవరు ఇవ్వరని, తోసుకొని పోవాల్సిందే అన్నారు. రాజకీయ నాయకుడికి ప్రజలు మాత్రమే వీఐపీలు అని చెప్పారు. నాయకులు ప్రజలను ప్రేమించాలని, సమస్యలు విని పరిష్కరించాలన్నారు.

ప్రధాని మోదీ (PM Modi) ఈ నెల 10న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే సభలో ఆయన పాల్గొనున్నారు. ఈ సభ కోసం ఎల్బీ నగర్ (LB Nagar) నియోజకవర్గంలోని శుభం కన్వెన్షన్ హాల్​లో ఎంపీ ఈటల శనివారం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అత్యంత ప్రజాస్వామికమైన పార్టీ అన్నారు. నిరంతరం ప్రవహించే సజీవ నది లాంటిదని చెప్పారు.

Eatala Rajender comments | వారసత్వ పార్టీ కాదు

ప్రాంతీయ పార్టీలలో జీవితకాలం కుటుంబ సభ్యులు అధ్యక్షులుగా ఉంటారని ఈటల అన్నారు. బీజేపీలో మాత్రం ఓ వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పని చేయగలరని చెప్పారు. బీజేపీ వారసత్వ పార్టీ కాదని, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే గొప్ప పార్టీ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Eatala Rajender comments | బెంగాల్​లో కాషాయ జెండా

బెంగాల్ గడ్డమీద కాషాయ జెండా ఎగురవేయబోతున్నామని ఈటల పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల్లో గెలిచినప్పుడు సీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నామని తెలిపారు. మన దగ్గర కూడా స్వీట్లు పంచుకొనే రోజు రావాలని ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ సభకు భారీగా ప్రజలను తీసుకు రావాలని ఆయన కోరారు. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు.

దీనిని కూడా చదవండి : Kavitha Political Statement | కాంగ్రెస్​ను గద్దె దించుతాం.. టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత

 

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *