Telangana Employees Protest | 5న ఉద్యోగుల సామూహిక నిరాహార దీక్ష

Balla Sandeep Kumar

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Telangana Employees Protest | తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఆధ్వర్యంలో మే 5న కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంలో సామూహిక నిరాహారదీక్ష చేయనున్నారు. ఈ మేరకు టీజీఈజేఏసీ నేతలు శనివారం వివరాలు వెల్లడించారు.

Telangana Employees Protest | ఉద్యోగులు.. ఉపాధ్యాయుల సమస్యలపై..

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా టీజీఈజేఏసీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరాహార దీక్షల్లో భాగంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం (Kamareddy Municipal Office) ఎదుట మే5న నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సభ్యులతో ఎల్లారెడ్డిలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు.

Telangana Employees Protest | ప్రధాన డిమాండ్లు ఇవే..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్​సీని వెంటనే ప్రకటించాలన్నారు. సీపీఎస్​ను CPS రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దాచుకున్న డబ్బును ఏకమొత్తంలో చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఈహెచ్​ఎస్​ను (EHS)ను వెంటనే అమలు చేయాలన్నారు. జేఏసీ అడిషనల్ సెక్రెటరీ జనరల్ అల్లాపూర్ కుశాల్, జిల్లా జేఏసీ బాధ్యులు అంబిర్ మనోహర్, యాదయ్య, వెంకట రమణ, విజయ రామరాజు, నార్ల అరుణ్ కుమార్, జగన్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వామ్యమని, వారిని దూరం చేస్తే రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుందని హెచ్చరించారు. సమావేశంలో మహిపాల్, పట్లోళ్ల శ్రీనివాస్, ఎండీవో ప్రకాష్, వినయ్ కుమార్, డీటీ శ్రీనివాస్, ఎ కిష్టయ్య, ఎం కృష్ణమూర్తి, కె దాసిరాం, కె సంగయ్య, బి.లక్ష్మణ్, పెన్షనర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement Protest | రోడ్డెక్కిన అన్నదాతలు.. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *