అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRICS Summit Delhi | బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 12, 13 తేదీలలో భారత్ మండపంలో జరగనుంది. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా దేశాధినేతలు, విదేశీ ప్రతినిధి బృందాలు, ఉన్నత స్థాయి ప్రముఖులు జాతీయ రాజధాని మీదుగా ప్రయాణించనున్నారు. బ్రిక్స్ సమ్మిట్ దృష్ట్యా ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సెప్టెంబర్ 11 శుక్రవారం మూసి వేస్తారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఢిల్లీ (Delhi) ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మూసి ఉంటాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. విదేశీ ప్రముఖులు వెళ్లే మార్గాలు, సదస్సు జరిగే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
BRICS Summit Delhi | ఢిల్లీ మెట్రో రైలు..
సదస్సు సమయంలో ఢిల్లీ మెట్రో సేవలు నెట్‌వర్క్ అంతటా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 11 నుంచి 13 వరకు సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్‌లోని ఢిల్లీ మెట్రో మ్యూజియం మూసి ఉంటుంది. విదేశీ ప్రముఖులు, వీవీఐపీ కాన్వాయ్‌ల రాకపోకల కోసం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఒక వివరణాత్మక ప్రణాళికను సిద్ధం చేశారు. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం సుమారు 4,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. వీవీఐపీల రాకపోకల సమయంలో గుర్తించిన 22 దారి మళ్లింపు పాయింట్ల వద్ద ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు.
ఇది కూడా చదవండి..: BRICS Summit | బ్రిక్స్‌పై కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నలు.. కౌంటర్ ఇచ్చిన శశిథరూరు